
సమస్యలు పరిష్కరించండి
మాది మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు రగుడు. వారం రోజులుగా గ్రామంలోని పలు వార్డుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు, సెస్ సిబ్బందికి చాలా సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలి.
– దొంతుల చంద్రం, రగుడు
మాది ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల. 2008లోనే అమ్మనాన్నా చనిపోయారు. ప్రస్తుతం నేను అనాథను. 2015లో కురి సిన వర్షానికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయింది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నా పేరు మీద ప్రొసీడింగ్ ఇస్తే ఇల్లు కట్టుకుంటాను.
– పండుగ ఆంజనేయులు, వల్లంపట్ల
సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి బాధితులు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. స్థానిక అధికారులు స్పందించడం లేదని.. భూమి కబ్జా చేశారని.. పింఛన్ రావడం లేదంటూ కలెక్టర్‌కు విన్నవిస్తున్నారు. వివిధ సమస్యలపై సోమవారం 154 అర్జీలు వచ్చాయి. దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ అధికారులు సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. రెవెన్యూ అధికారి గడ్డం నగేశ్, వేములవాడ ఆర్డీవో రాధాభాయి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
మార్కెట్ కమిటీల ద్వారానే రైతులకు అవసరమయ్యే విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయాలి. ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేయాలి.
– ఆలూరి మల్లారెడ్డి, వేములవాడ అర్బన్

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి