గ్రీవెన్స్‌ డేకు 23 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ డేకు 23 ఫిర్యాదులు

Sep 9 2025 6:52 AM | Updated on Sep 9 2025 2:39 PM

ఎస్పీ మహేశ్‌ బి గీతే 

 

 

 

● ఎస్పీ మహేశ్‌ బి గీతే 
 

సిరిసిల్ల క్రైం: బాధితులు తమ సమస్యలను నేరుగా వివరించేందుకు గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బి గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ప్రజల నుంచి 23 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీ లించి ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్‌ చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇప్పుడే కొరత ఎందుకొచ్చింది? 

బీఆర్‌ఎస్‌ వేములవాడ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు 

వేములవాడ: పదేళ్లుగా రాని యూరియా కొరత ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనలో ఎందుకు ఏర్పడుతుందని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ప్రశ్నించారు. వేములవాడలోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేములవాడలో కోపరేటీవ్‌ సొసైటీలోని రైతులకు తమ పార్టీ నాయకులు అండగా నిలిస్తే 8 మందిపై కేసు పెట్టడంపై నిలదీశారు. దసరా తర్వాత గుడి అభివృద్ధి చేస్తామంటున్నారని, సమ్మక్క–సారలమ్మ జాతర వరకు రాజన్న దర్శనాలు కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన పెంచుకొని మాట్లాడాలని హి తవు పలికారు. నాయకులు ఆకుల దేవరాజం, తీగల రవీందర్‌గౌడ్‌, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాజు, విజయ్‌, క్రాంతి, కుమార్‌ పాల్గొన్నారు.

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై వివరించాలి 
బోయినపల్లి(చొప్పదండి): గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌.. పోక్సో చట్టంపై బాలికలకు అవగాహన ఉండాలని జిల్లా శిశు పరిరక్షణ అధికారి(డీసీపీవో) కవిత కోరారు. స్థానిక మోడల్‌స్కూల్‌, కళాశాల విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. డీసీపీవో కవిత బాల్య వివాహాలు, బాలకార్మికులు, భిక్షాటనలో ఉన్న పిల్లలు, గుడ్‌ టచ్‌ – బ్యాడ్‌ టచ్‌ గురించి తెలియజేశారు. ఎల్సీపీవో అంజయ్య, ప్రిన్సిపాల్‌ ఉన్నారు.

కొత్త బస్టాండుకు బస్సులు రావాలి

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రతీ ఆర్టీసీ బస్సు కొత్త బస్టాండ్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొత్తబస్టాండు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక డిపో ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. హైదరాబాద్‌, సిద్దిపేటకు వెళ్లే బస్సులు కొత్తబస్టాండ్‌కు రావాలని కోరారు. అనంతరం డిపో డీఎం ప్రకాశ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. నంది శంకర్‌, పంతం రవి, మూశం రమేశ్‌, మోర రవి, మోతిలాల్‌నాయక్‌, జగ్గాని మల్లేశం, కూరపాటి శ్రీశైలం పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న బాలికల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి. హోరాహోరీగా జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్వంచ (ప్రథమ), కొత్తగూడెం(ద్వితీయ) స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో ఎల్లారెడ్డిపేట(ప్రథమ), ఇందల్‌వాయి(ద్వితీయ), వాలీబాల్‌లో ఇందల్‌వాయి(ప్రథమ), దుమ్ముగూడెం (ద్వితీయ), హ్యాండ్‌బాల్‌లో కురివి(ప్రథమ), కల్వకుర్తి(ద్వితీయ) స్థానాలు సాధించాయి. ఫుట్‌బాల్‌లో గందుగులపల్లి(ప్రథమ), ఎల్లారెడ్డిపేట(ద్వితీయ), బేస్‌బాల్‌లో గాంధారి(ప్రథమ), బాలానగర్‌(ద్వితీయ), హాకీలో గందుగులపల్లి(ప్రథమ), ఎల్లారెడ్డిపేట(ద్వితీయ) స్థానాలు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ రామ్‌సూరత్‌యాదవ్‌ వివరించారు. విజేతలుగా నిలిచిన జట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌లో ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఆయా జట్లు పాల్గొంటాయని వివరించారు.

గ్రీవెన్స్‌ డేకు 23 ఫిర్యాదులు1
1/3

గ్రీవెన్స్‌ డేకు 23 ఫిర్యాదులు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై వివరించాలి 2
2/3

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై వివరించాలి

ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు3
3/3

ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement