
ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం
● దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ
ఇల్లంతకుంట(మానకొండూర్): ముత్యాల పోచమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని దేవా దాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ పేర్కొన్నారు. మండలంలోని అనంతగిరి ముత్యాల పోచమ్మ ఆలయ 6వ వార్షికోత్సవానికి సోమవారం హాజరై మాట్లాడారు. కమిటీ సభ్యులు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గ్రామస్తులు చర్చించుకొని.. ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. ఆల య కమిటీ చైర్మన్ కొలిపురి అంతగిరి, ఈవో మారుతీరావు, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, కమిటీ సభ్యులు ముత్తయ్య, పోచవ్వ, శంకరయ్య, మల్లయ్య, తిరుపతిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రజనీకాంత్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.