
రైల్వేలైన్ మట్టికి అనుమతులు పొందాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: రైల్వేలైన్ నిర్మాణానికి మట్టి తరలింపునకు అనుమతులు పొందాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం రైల్వే ఇంజినీర్లతో సమీక్షించారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ శివారులోని చండ్రవాగు చెరువు నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని కేటాయించగా ఇప్పటి వరకు 90,672 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారన్నారు. సిరిసిల్లలో రైల్వేస్టేషన్ నిర్మాణం, రైల్వేలైన్ నిర్మాణం కోసం సమీపంలో గల పాయింట్ నుంచి అవసరమైన మట్టి తరలింపు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలని, నిత్యం రాయించ డం, చదివించడం చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయించాలని అధి కారులకు సూచించారు. మండలాలవారీగా మంజూరు చేసిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై సమీక్షించారు. ఇసుక ట్రాక్టర్‌కు రూ.1500 కంటే ఎక్కువ వసూలు చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎస్పీ మహేశ్ బి గీతే, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, రైల్వే ఇంజినీర్ మూర్తి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, హౌసింగ్ పీడీ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.