
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సిరిసిల్లటౌన్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పుట్టినరోజు వేడుకలు పట్టణంలో గురువారం పండుగలా జరిగాయి. గాంధీచౌక్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఽఆధ్వర్యంలో కేక్‌లు కోసి స్వీట్లు పంచారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి, మెగా ప్లాంటేషన్ చేపట్టారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అఽధ్యక్షుడు జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళ, మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, కుంభాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.