
‘మహాలక్ష్మీ’తో మహిళల్లో ఆనందం
● రూ.110కోట్లు ఆదా చేశారు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకాన్ని అతివలు సద్వినియోగం చేసుకున్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలు 200 కోట్ల టికెట్లపై ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో బుధవారం సంబరా లు నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలోని మహిళలు 3 కోట్ల ఉచిత టికెట్లపై ప్రయాణం చేసి, రూ.110కోట్లు ఆదా చేశారని తెలిపారు. ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బును పిల్లల ఆరోగ్యం, ఉన్నత చదువులు, పొదుపు చేయాలని సూచించారు. డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు దూరంగా..లక్ష్యానికి చేరువగా..
సిరిసిల్లకల్చరల్: మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్యానికి చేరువ కావాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలపై కలెక్టరేట్‌లో నార్కోటిక్ నియంత్రణాధికారులతో సమీక్షించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కలిగే అనర్థాల గురించి విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎంహెచ్‌వో రజిత, డీఏవో అఫ్జల్‌బేగం, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యతోనే ఉన్నత స్థానాలు
వేములవాడరూరల్: విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు చదువే ఆయుధమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం లింగంపల్లి ప్రైమరీ, హన్మాజీపేటలోని ప్రైమరీ, హైస్కూ ల్, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. లింగంపల్లిలో నిరుపయోగంలో ఉన్న గదులను వినియోగంలోకి తీసుకురావాలని సూ చించారు. హన్మాజీపేటలోని హైస్కూల్ పదోతరగతి విద్యార్థులకు గణితంలో పలు ప్రశ్నలు బోర్డు మీద రాసి సమాధానాలు రాయించారు. కంప్యూటర్‌లు, గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఎక్కువ ఉన్న డెస్క్‌లను అవసరమైన ఇతర పాఠశాలలకు పంపించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.