
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● ఫర్టిలైజర్‌షాపులు ప్రారంభం
చందుర్తి/వేములవాడఅర్బన్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం నర్సింగపూర్, వేములవాడ పట్ట ణంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఫర్టిలైజర్‌షాపులు, విత్తనాల దుకాణాలను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సోలార్ విద్యు త్ ఉత్పత్తి ప్లాంట్లు, రైసుమిల్లులు, పెట్రోల్‌పంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అనేక వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకా రాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీఆర్డీఏ శేషా ద్రి, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నర్సింగపూర్ మాజీ ఉపసర్పంంచ్ కాసారపు శ్రీనివాస్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం రజిత పాల్గొన్నారు.
ఆర్టీసీలో సంబరాలు
వేములవాడలోని ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళలను, విద్యార్థులను సన్మానించారు.