
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రుద్రంగి(వేములవాడ): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలోని గ్రామపంచాయతీ ఆవరణలో అర్హులైన 11 మంది లబ్ధిదారులకు రూ.4లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిఽధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామన్నారు. మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్‌ఓసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్లపై చిలుకు మంజూరు చేయించినట్లు తెలిపారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత, మాజీ ఉపసర్పంచ్ బైరి గంగమల్లయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు.