
కల్యాణ వైభోగమే
● తలంబ్రాలకు వేళాయె
● 25 నుంచి పెళ్లి సందడి
● ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల జంటల పెళ్లిల్లు
● ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీ
● పెరిగిన వస్త్రాలు, బంగారం కొనుగోళ్లు
పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25 శ్రావణమాసం మొదలు నవంబర్ చివరి వరకు ఊరువాడ పెళ్లి సందడి నెలకొననుంది. బంగారు నగల దుకాణాలు, పెళ్లివస్త్రాలయాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో సుమారు 5వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు చెప్తున్నారు. కాగా, మారిన కాలానికి అనుగుణంగా సంగీత్, మెహెందీ, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటి అదనపు కార్యాలు చోటు చేసుకుంటూ వివాహ వ్యయాన్ని భారీగా పెంచేశాయి. జీవితంలో ఒకేసారి జరిగే వేడుకనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చు పెడుతుండడం ఇప్పుడు సర్వసాధారణమైంది. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్)

కల్యాణ వైభోగమే