
‘ఇందిరమ్మ’ నిర్మాణ ధరలు నియంత్రించాలి
సిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మెటీరియల్ ధరలను జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు నియంత్రించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. స్థానిక కార్మిక భవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మొరం, ఇసుకకు ప్రతీ రోజు పర్మిషన్ ఇవ్వాలన్నారు. కట్రౌతు, కంకర, ఇసుక, మొరం తీసుకొస్తున్న ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు పట్టుకోవడంతో ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అజ్జు, వేణు, కోరెపు క్రాంతి పాల్గొన్నారు.
‘ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలి’
చందుర్తి(వేములవాడ): విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం విన్నవించారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవురం సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి ఆధ్వర్యంలో కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. డీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్లు దొంతుల శ్రీహరి, జిల్లా కౌన్సిలర్లు గడప రఘుపతిరావు, గుండబోయిన శ్రీనివాస్, నిజానపు పర్శరాములు, మేడిశెలిమిల దశరథం, వివిధ మండల బాధ్యులు మెట్ట మహేశ్, వెంగలి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, బానోతు రాజు తదితరులు పాల్గొన్నారు.
వరదవెల్లి దత్తాలయంలో గిరి ప్రదక్షిణ
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని వరదవెల్లిగుట్టపై స్వయంభూగా వెలసిన గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో సోమవారం భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. దత్త నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గిరిప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ భక్త బృందం తెలిపారు. ధర్మప్రవచనాల కర్త, వరదవెల్లి గిరిప్రదక్షిణ రూపకర్త గురువు శ్రీనివాస్ హాజరైనట్లు తెలిపారు.

‘ఇందిరమ్మ’ నిర్మాణ ధరలు నియంత్రించాలి

‘ఇందిరమ్మ’ నిర్మాణ ధరలు నియంత్రించాలి