
పోస్టాఫీస్.. చిరునామా ఎక్కడో?!
● ఖాళీగానే ప్రభుత్వ స్థలం
● సిబ్బంది కొరతతో ఇబ్బంది
వేములవాడరూరల్: పట్టణంలోని పోస్టాఫీస్ ఎక్కడ ఉందో పట్టణ ప్రజలకు తెలియడం లేదు. మొన్నటి వరకు రాజరాజేశ్వరస్వామి వసతిగదులైన పార్వతీ పురంలో ఉన్న ఈ పోస్టాఫీస్‌ను భగవంతరావునగర్‌కు మార్చారు. ఈ చిరునామా తెలియక తికమక పడుతున్నారు. 2012లో అప్పటి ఎంపీ పొన్నం ప్ర భాకర్ రైల్వే బుకింగ్ కౌంటర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఈ సేవలు కూడా అందడం లేదు. పోలీస్‌స్టేషన్ ఎదురుగా టెలీఫోన్ ఆఫీస్ వెనుక భాగంలో దాదాపు 11 గుంటల స్థలా న్ని గతంలోనే పోస్టాఫీస్ కోసం కేటాయించారు. నిధులు రాకపోవడంతో భవనం నిర్మించడం లేదు. దీంతో ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది.

పోస్టాఫీస్.. చిరునామా ఎక్కడో?!