
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్లటౌన్/వేములవాడరూరల్: క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ సూచించారు. మంగళవారం సిరిసిల్లలో, వేములవాడ మండలంలో అత్యవసర సేవల అంబులెన్స్‌లు, 108, 102 అమ్మఒడి వాహనాలు, 1962, సంచార పశు వైద్యశాల, పార్థివ వాహనాల పనితీరును జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉన్న వాహనాల రికార్డులు, పరిశీలించి సంతృపి్‌త్ వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే పైలెట్లకు పలు సూచనలు చేశారు. వాహనాల మరమ్మతులో ఇబ్బందులు తలెత్తితే జిల్లా మేనేజర్‌కు వెంటనే తెలియజేయాలన్నారు. కార్యక్రమాల్లో సిబ్బంది పెద్ది శ్రీనివాస్, జలగం సత్యసాగర్, వడ్నాల అనిల్ కుమార్, కొమిరిశెట్టి సతీశ్, ప్రణయ్, 1962 డాక్టర్ మనీషా, పైలట్ ప్రవీణ్, కెప్టెన్ నరేశ్, హెల్పర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.