
అనుమతులతోనే ఇసుక
● రెవెన్యూ, పోలీస్ అధికారుల నిఘా
వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వైనంపై సాక్షిలో వరుసగా రెండు రోజు లు కథనాలు రావడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించారు. లింగంపల్లి నుంచి మల్లారంలో ఇసుకను తీసుకునేందుకు శనివారం అనుమతులు ఇచ్చారు. అక్రమంగా ఇసుక తరలిపోకుండా పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను, కార్యదర్శి, తహసీల్దార్ అనుమతి పత్రాలను పరిశీలించిన తర్వాతనే ట్రాక్టర్‌లకు అనుమతులు ఇచ్చారు.