
పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతోపాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు.
● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు
● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు
తమతోనే పిల్లలు
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన పుర్రె రమేశ్, కవిత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రమేశ్ రాయికల్ హైస్కూల్‌లో పీడీగా, కవిత రాయికల్ మండలం ఇటిక్యాలలోని ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి కూతురు ఆరాధ్యను వారు పనిచేస్తున్న స్కూల్‌లో చేర్పించారు. మొదట్లో కవిత పనిచేసిన భూపతిపూర్‌లో 1 నుంచి 3వ తరగతి, ప్రస్తుతం ఇటిక్యాలలో 4వ తరగతిలో చేర్పించారు.
పిల్లలనూ సర్కార్ బడికే..
ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి యామ రాజు తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. రాజు కూతుళ్లు యామ ధీరజ, తనూజ మండలంలోని రహీంఖాన్‌పేట ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. పెద్ద కూతురు ఇంటర్‌లో 987 మార్కులు సాధించి ప్రస్తుతం కోటిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చేరింది. చిన్నకూతురు తనూజ మోడల్‌స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.
కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్‌పై స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు.
కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్‌తేజ్ అదే స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నారు.
తల్లీకొడుకులు ఒకే బడికి..
కోరుట్ల: ఈ తల్లులు ప్రభుత్వ టీచర్లు. తమ పిల్లలను సైతం వారు పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీలక్ష్మీ తన కుమారుడు శ్రీయాన్‌ను అదే స్కూల్‌లో 4వ తరగతిలో చదివిపిస్తున్నారు. నిత్యం తనతోపాటు స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యాభ్యాసం సాగుతోందని, అప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకశక్తి పెరుగుతుందన్నారు.
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం మాదాపూర్ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ ఎలిగేటి రాజమణి తన కుమారుడిని అదే పాఠశాలలో చదివిస్తోంది. కోరుట్లకు చెందిన రాజమణి తన కొడుకు హిమాన్ష్‌ను తాను పనిచేస్తున్న స్కూల్‌లోనే 3వ తరగతిలో చేర్పించింది. నిత్యం బైక్‌పై కొడుకును తీసుకొని స్కూల్‌కు వెళ్లి వస్తోంది. రెండేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పనిచేసే సమయంలోనూ తన కొడుకును తీసుకెళ్లేవారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధన అందుతుండడంతోనే తీసుకెళ్తున్నట్లు రాజమణి తెలిపారు.
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జావెద్ తన పిల్లలను అదే బడిలో చదివిపిస్తున్నారు. తన పెద్ద కొడుకు నవీదుల్ రెహమాన్‌ను అదే స్కూల్‌లో 7వ తరగతి, చిన్న కొడుకు టిప్పు ఉల్ రహమాన్‌ను దుర్గయ్యపల్లి స్కూల్‌లో 4వ తరగతిలో చేర్పించాడు.
ధర్మపురి: ధర్మపురి మండలం రాయపట్నం స్కూల్‌లో పనిచేస్తున్న బండారు రాజు తన కొడుకు రోహన్‌ను అదే బడిలో 3వ తరగతిలో చేర్పించారు. గతంలో వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటలో పనిచేసిన సమయంలో తన వెంటే కొడుకును తీసుకెళ్లారు.
బోధనపై నమ్మకంతో..
వేములవాడ: కథలాపూర్ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్‌లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు.
జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్‌లో సత్యజోస్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్‌ను జమ్మికుంట హైస్కూల్‌లో 9వ తరగతిలో చేర్పించారు.
విద్య వ్యాపారం కాదని..
సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేసేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్‌పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్‌కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు.

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి

పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి