
‘మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు’
సిరిసిల్లటౌన్: మానసిక సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్టు పున్నంచందర్ సూచించారు. ప్రగతినగర్‌లోని నేతకార్మికులకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నిద్రలేమితో మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయన్నారు. జీవనశైలిలో మార్పులతో బ్లడ్‌ప్రెషర్, డయాబెటీస్, క్యాన్సర్స్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అనుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని సూచించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలను తొలగించేందుకు మైండ్‌కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైండ్‌కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి పాల్గొన్నారు.
ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి స్పందన
● సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు
సిరిసిల్లటౌన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆధ్యాత్మికత యాత్రలకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చిందని సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. ఈనెల 27న సిరిసిల్ల నుంచి వివిధ ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీ విశేషాలను సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక బస్సు నడపడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. అరుణాచలం. మంత్రాలయం, భద్రాచలం, పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 30 నుంచి 40 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివరాలకు 90634 03971, 6304 17121, 73828 50616, 99592 25929లలో సంప్రదించాలని కోరారు.

‘మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు’