
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు
సిరిసిల్లకల్చరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించనుందని పార్లమెంట్ కో–కన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ తన హామీలను నెరవేరుస్తోందన్నారు. రైతుభరోసా సొమ్ముతో రైతుఉల పండుగ చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా వారు తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు కిషన్‌రావు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌గౌడ్, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఎడ్ల తిరుపతి, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అంజిరెడ్డి, ఆకుల పరశురాం, విఠల్‌రెడ్డి, శ్రీనివాస్, సూర్యప్రసాద్ పాల్గొన్నారు.
● పార్లమెంట్ కో–కన్వీనర్ చక్రధర్‌రెడ్డి