
జ్ఞానం పంచుతాం.. ఆకలి తీరుస్తాం
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదోవార్డు చిన్నబోనాలలోని ఎస్సీ గురుకుల హాస్టల్‌లో మెస్ కాంట్రాక్టర్ సరిగ్గా విధులకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయినులు వంట చేశారు. మెస్ కాంట్రాక్టర్‌కు సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మహిళా టీచర్లు వంట చేసి వడ్డించారు. 540 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులకు భోజనం అందలేదు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ సోమవారం స్కూల్‌కు చేరుకొని పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులకు వంట చేసి వడ్డించారు.