
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం మండలం న్యూమారేడుపాకలోని నర్సింహపురం(ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వి.అనిల్‌కుమార్ తన ఇద్దరు కుమారులను అదే పాఠశాలలో చదివిపిస్తున్నారు. పెద్దకుమారుడు శ్రీహన్ 5వ తరగతి, చిన్నకుమారుడు 2వ తరగతి చదువుతున్నారు. వారిద్దరిని నిత్యం తనతోపాటు బైక్‌పై ప్రభుత్వ బడికి తీసుకొస్తున్నాడు. తను పనిచేస్తున్న పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిపిస్తూ.. గ్రామంలోని తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచినట్లు టీచర్ అనిల్‌కుమార్ తెలిపారు.