
లక్ష్యం మేరకు అడ్మిషన్స్ సాధించాలి
సిరిసిల్ల: ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో మెరుగైన బోధన అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్ విద్యపై ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 10 ప్రభుత్వ కళాశాలల పరిధిలో ఫస్టియర్‌లో 1,777 అడ్మిషన్స్ సాధించడం లక్ష్యం కాగా 1,116 మందిని ఎనరోల్ చేసుకోవడం జరిగిందన్నారు. అడ్మిషన్స్ పెంచేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలిచ్చారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఇంటర్ విద్య చాలా వెనకబడిందని, పరీక్షల ఫలితాల్లో చాలా ఇంప్రూవ్ కావాలని సూచించారు. కళాశాలలో యాంటి డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, కెరియర్ కౌన్సెలింగ్ అందించాలని కోరారు.జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలి
వేములవాడఅర్బన్: ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అ న్నారు. మంగళవారం వేములవాడ మండలం చింతల్‌ఠాణా ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులతో నిత్యం చదివించడం, రాయించడంపై దృష్టి సా రించాలన్నారు. డెస్క్‌లు తక్కువగా ఉండడంతో వే రే పాఠశాల నుంచి తెప్పించాలని సూచించారు. అ నంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా