
కొత్త బాలికా సంరక్షణ పథకం స్వరూపం
ఐసీడీఎస్ ప్రాజెక్టులు: సిరిసిల్ల, వేములవాడ గ్రామాలు: 260 బాండ్లు: 52,014 ఒక్క కూతురు ఉన్న వాళ్లు: 7,874 ఒక్క కూతురు, ఒక్క బాబు ఉన్న వాళ్లు : 25,887 ఇద్దరు కూతుళ్లు ఉన్న వాళ్లు: 18,253 బాండ్లు జారీ అయిన ఏడాది : 2005 నుంచి 2013
సిరిసిల్ల: ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వపరంగా భరోసా కల్పించే లక్ష్యంతో 2005లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే కొత్త బాలికా సంరక్షణ పథకం. బీమా ఆధారిత కొత్త బాలికా సంరక్షణ పథకం 2023లోనే గడువు ముగిసినా బాండ్ పేపర్‌లో పేర్కొన్న ప్రకారం లబ్ధిదారులకు డబ్బులు రావడం లేదు. ఎల్‌ఐసీ సంస్థ పీ అండ్ జీఎస్ సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేశాయి.
బాలిక విద్యనే ప్రోత్సహించాలనే..
కుటుంబంలో ఒక్కరే ఆడపిల్ల ఉంటే 20 ఏళ్లు నిండిన వెంటనే రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలుంటే ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున బాండ్ జారీ చేశారు. మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.60వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే దాకా ఏటా రూ.1,200 ఉపకార వేతనం చెల్లించాల్సి ఉంటుంది. బాల్య వివాహాలు అరికట్టేందుకు, ఆడపిల్లలను చదివించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. 2005 నుంచి 2013 వరకు అమలులో ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో చెల్లింపులకు బ్రేక్ పడింది. నిజానికి ఎల్‌ఐసీ సంస్థ జారీచేసిన ఈ బాండ్ పేపర్లలో ఏపీ అనే అక్షరాలు ఉండడంతో.. రాష్ట్ర ఏర్పాటుతో ఆ బాండ్ పేపర్లు చెల్లింపులకు నోచుకోవడం లేదు. జిల్లాలో మెచ్యూరిటీ గడువు తీరినా సర్కారు సాయం అందడం లేదు.
నిలిచిపోయిన కొత్తబాలికా సంరక్షణ పథకం చెల్లింపులు
2005 నుంచి 2013 వరకు బాండ్ల జారీ
జిల్లాలో 52వేల మంది లబ్ధిదారులు
గడువు దాటినా దక్కని ప్రయోజనం
ఉన్నతాధికారులకు నివేదించాం
కొత్త బాలికా సంరక్షణ పథకం లబ్ధిదారులు ఆఫీస్‌కు వచ్చిపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించాం. ఎల్‌ఐసీ సంస్థ జారీచేసిన పత్రాల్లో ఏపీ అని ఉండడంతో చెల్లింపులకు ఇబ్బందులు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు కల్యాణలక్ష్మీ పథకం అమలులో ఉండడంతో బాలికా సంరక్షణ పథకాన్ని అందులోనే కలిపేసినట్లు పేర్కొంటున్నారు. లబ్ధిదారులు ఆఫీస్‌కు తిరిగిపోతున్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏదైనా పరిష్కారం లభిస్తే లబ్ధిదారులకు ప్రయోజనం దక్కుతుంది. – లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమాధికారి

కొత్త బాలికా సంరక్షణ పథకం స్వరూపం