
ప్రతీ సమస్యకు పరిష్కారం
● డాక్టర్ ప్రవీణ్‌కుమార్, న్యూరో సైకియాట్రిస్ట్
సిరిసిల్ల: ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ బి.ప్రవీణ్‌కుమార్ సూచించారు. నెహ్రూనగర్‌లో మైండ్‌కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేతకార్మికులకు సామూహిక కౌన్సెలింగ్‌ను గురువారం నిర్వహించారు. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలో తనను సంప్రదిస్తే వైద్యం అందించి మద్యపాన వ్యసనం నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలన్నారు. కార్మికులు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలోని కౌన్సెలింగ్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. మైండ్‌కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ, బూర్ల శ్రీమతి పాల్గొన్నారు.
ఉచిత నైపుణ్య శిక్షణ
సిరిసిల్లకల్చరల్: వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సీఈవో గురువారం ప్రకటనలో తెలిపారు. సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనింగ్, వ్యక్తిత్వ వికాసం, రెజ్యు మో తయారీ, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మాక్ ఇంటర్వ్యూ, ఆత్మవిశ్వాస నిర్మాణం తదితర అంశాల్లో నాలుగు రోజులపాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 30 ఏళ్లలోపు డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఆధార్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో జిల్లా బీసీడీవో కార్యాలయంలో ఈనెల 14లోపు అందజేయాలని సూచించారు.
8న శీత్లాభవాని వేడుకలు
సిరిసిల్లటౌన్: జిల్ల వ్యాప్తంగా గోర్ బంజారాలు ఈనెల 8న శీత్లాభవాని వేడుకలు నిర్వహించుకోవాలని ఆ సంఘం జిల్లా ప్రతినిధి సురేష్‌నాయక్ కోరారు. అన్ని తండాలలోని ప్రజాప్రతినిధులు ఈ వేడుకలకు సహకరించాలని కోరారు.
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వం
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమ
సిరిసిల్లటౌన్: కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ కేంద్రంలో అధికాారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ విమర్శించారు. స్థానిక బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో సీఐటీయూ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ నాయకులు గుర్రం అశోక్, అన్నల్‌దాస్ గణేశ్, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్‌చంద్ర, గీస భిక్షపతి, నక్క దేవదాస్, దాసరి రూప, సావనపల్లి రాములు, కోల శ్రీనివాస్, జిందం కమలాకర్, ఒగ్గు గణేశ్, భారతి, చంద్రకళ, జయశీల, లత, ప్రభాకర్, నర్సయ్య, పోచమల్లు పాల్గొన్నారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
సిరిసిల్లక్రైం: వేధింపులకు గురిచేస్తున్న వారితోపాటు పోకిరీ చేష్టలకు పాల్పడుతున్న వారిపై నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జూన్‌లో షీటీమ్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో 2 ఎఫ్‌ఐఆర్‌లు, 4 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల వద్దకు వెళ్లి షీటీమ్ బృందం అవగాహన కల్పిస్తుంది. జిల్లా షీటీమ్‌కు 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రతీ సమస్యకు పరిష్కారం

ప్రతీ సమస్యకు పరిష్కారం