
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిరిసిల్లలోని మాన్య ఫంక్షన్‌హాల్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్‌బీఐ అధికారి సాయితేజరెడ్డి మాట్లాడుతూ పొదుపు నియమాలు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్, చిరిగిన నోట్లు, సైబర్‌నేరాల వివరించారు. పొదుపు, ఆర్‌బీఐ ఏజీఎం కృష్ణ చైతన్య మాట్లాడుతూ కరెన్సీ నోట్ల భద్రత విషయాలు, చిరిగిన నోట్ల మార్పిడి విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. మరో ఏజీఎం పృథ్వి పాల్గుణ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని రకాల లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరానికి గురైతే 1930లో కాల్ చేయాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఎన్.మల్లికార్జున్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్, మహిళ సంఘాల లీడర్లు, సీనియర్ సిటిజెన్స్, కళాశాల విద్యార్థులు, ఆర్ధిక అక్షరాస్యత కౌన్సెలర్లు పాల్గొన్నారు.