
ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు భేష్
సిరిసిల్ల: ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు భేష్ అని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అభినందించారు. ఆదర్శ మండల సమాఖ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆత్మనిర్భర్ సంఘాతన్ అవార్డుకు ఎంపికవగా.. శుక్రవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు బ్యాంకు రుణాలు అందిస్తూ.. సకాలంలో రికవరీ చేయడం బాగుందన్నారు. మండల, గ్రామ స్థాయిలో క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. సమాఖ్యకు నిరంతర ఆదాయానికి గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీవో శేషాద్రి, డీపీఎం వంగ రవీందర్, ఏపీఎం వాణి పాల్గొన్నారు.
గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గోరింటాలలో లోతువాగు చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వాగు ప్రాంతాన్ని, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. ఎంపీడీవో రాజేందర్ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. త్వరగా నిర్మించాలని సూచించారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సూచించారు. మరిమడ్లలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ భావన పంచాల్ తదితరులు ఉన్నారు.
మోడల్ ఇందిరమ్మ ఇల్లు పరిశీలన
వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లును కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ ముక్తార్‌పాషా, ఆర్‌ఐ శివకుమార్ ఉన్నారు.
జాతీయ అవార్డుకు ఎంపికవడంపై కలెక్టర్ అభినందనలు
నిరంతర ఆదాయానికి గ్యాస్ ఏజెన్సీ మంజూరు