రేషన్‌షాప్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

రేషన్‌షాప్‌ సీజ్‌

Jul 5 2025 6:02 AM | Updated on Jul 5 2025 6:02 AM

రేషన్

రేషన్‌షాప్‌ సీజ్‌

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని సోమారంపేటలోని ప్రభుత్వ రేషన్‌షాప్‌ను శుక్రవారం జిల్లా అధికారులు సీజ్‌ చేశారు. సోమారంపేట రేషన్‌షాపులో జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయగా నాలుగు క్వింటాళ్ల సన్నబియ్యం తేడా రావడంతో షాపు సీజ్‌ చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారి సత్యనారాయణ, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సెస్‌ చైర్మన్‌ రాజీనామా చేయాలి

సిరిసిల్లటౌన్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరిసిల్ల సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చిక్కాల రామారావు చైర్మన్‌గా ఎన్నికై నప్పటి నుంచి వివాదాలకు కేంద్రమవుతున్నారన్నారు. ఆర్‌సీఎస్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ కోఆపరేటీవ్‌ సొసైటీస్‌ అనుమతి లేకుండా అనేక నియామకాలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. జిల్లా సహకార అధికారి విచారణ చేపట్టాలని కోరారు. నాయకులు గుజ్జ దేవదాస్‌, బొల్లు సత్యనారాయణ పాల్గొన్నారు.

నిర్మాణాల పన్ను వసూలు

సిరిసిల్లటౌన్‌: శ్రీశాల వెంకన్న ఆలయ భూముల్లో ఇండ్లు నిర్మాణాలు చేపట్టిన యజమానుల నుంచి శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు రూ.వేయి చొప్పున వసూలు చేశారు. ఆలయ భూముల్లో నిర్మాణాలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయా ఇంటి యజమానుల నుంచి రుసుం వసూలు చేస్తున్నట్లు ఈవో మారుతిరావు చెప్పారు. దేవాదాయ సిబ్బంది రవీందర్‌, నాగరాజు, లక్ష్మణ్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

వాటర్‌షెడ్‌ పథకంతో నీటి నిల్వలు పెంపు

డీఆర్డీవో శేషాద్రి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడవిలో వాటర్‌షెడ్‌ పథకంతో ఏర్పాటు చేస్తున్న ఊటకుంట, చెక్‌డ్యాంల నిర్మాణాలతో నీటినిల్వలు పెంపొందుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి పేర్కొన్నారు. మండలంలోని రాచర్లగుండారం, రాచర్లతిమ్మాపూర్‌ గ్రామాల్లోని వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా చేపట్టిన ఊటకుంట, చెక్‌డ్యాం పనులను శుక్రవారం పరిశీలించారు. ఏఏపీవో జోగం రాజు, వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ అధికారి శ్రీహరి, ఏపీవో కొమురయ్య, ఇంజినీర్‌ అర్షద్‌ పాషా, ఎంఈవో కృష్ణహరి, ప్రత్యేకాధికారి భాస్కర్‌రెడ్డి, టెక్నికల్‌ అధికారి రమేశ్‌, సాంకేతిక సహయకులు రాజు, నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు దేవరాజు, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

సమాచారశాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు

సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా సమాచార, పౌరసంబంధాల శాఖలో 150 ఉద్యోగాలను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అసిస్టెంట్‌ పీఆర్‌వో, పబ్లిసిటీ అసిస్టెంట్‌ పోస్టులు రెండు, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఒక్క పోస్టును భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ పీఆర్‌వో పోస్టుకు రూ.36,750, పబ్లిసిటీ అసిస్టెంట్‌కు రూ.27,130, ఆఫీస్‌ సబార్డినేట్‌కు రూ.15,600 వేతనం చెల్లించనున్నారు.

రేషన్‌షాప్‌ సీజ్‌ 
1
1/3

రేషన్‌షాప్‌ సీజ్‌

రేషన్‌షాప్‌ సీజ్‌ 
2
2/3

రేషన్‌షాప్‌ సీజ్‌

రేషన్‌షాప్‌ సీజ్‌ 
3
3/3

రేషన్‌షాప్‌ సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement