
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కో రారు. మండలంలోని మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శుక్రవారం రూ.5.14కోట్లతో చేపట్టిన అదనపు మౌలిక వసతుల నిర్మాణం పనులకు కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాతో కలిసి భూమిపూజ చేశారు. కేంద్రమంత్రికి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు. విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఏఐ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ భావన పంచాల్, బీజీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండలాధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మ్యాన రాంప్రసాద్, ప్రతాప రామకృష్ణ, ఎర్రం మహేశ్, కిష్టస్వామి పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
మరిమడ్ల ఏకలవ్య పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం