
సమస్యలు పరిష్కరిస్తాం
● వేములవాడ కమిషనర్ అన్వేశ్ ● ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌కు స్పందన
వేములవాడ: మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ అన్వేశ్ పేర్కొన్నారు. శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. పట్టణ ప్రజలు తెలిపిన సమస్యలను నోట్ చేసుకున్న కమిషనర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రశ్న : ఓపెన్‌జిమ్‌లో పరికరాలు పాడ య్యాయి. వాటిని బాగుచేయించండి.
– దేవరకొండ ప్రసాద్
కమిషనర్: ఓపెన్‌జిమ్‌లో పరికరాలను తక్షణమే మరమ్మతు చేయిస్తాం. ఓపెన్‌జిమ్‌లు అన్నింటినీ బాగుచేయిస్తాం.
ప్రశ్న : డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు. చెత్తబండ్లు సకాలంలో రావడం లేదు.
– దేవరాజు, గోస్కుల ప్రభాకర్, డాక్టర్ రాధాకృష్ణ, ఎడ్ల శ్రీనివాస్, వి.ప్రతాప్
కమిషనర్ : డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బందితో పనులు చేయించి రెండు రోజుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాం. చెత్తబండ్లు రెగ్యులర్‌గా వచ్చేలా చొరవ తీసుకుంటాం. చెత్తను బయట వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి.
ప్రశ్న: రోడ్లు బాగాలేవు. బురద పేరుకుపోతుంది.
– ఎన్.సురేశ్, అజయ్–వరలక్ష్మినగర్,
రాజేశం–భగవంతరావునగర్,
అద్దెంకి సత్తయ్య–వేములవాడ
కమిషనర్ : కోనాయపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పడిన వరలక్ష్మినగర్‌లో అన్నీ సమస్యలే ఉన్నాయి. రోడ్డుపై కనీసం మొరం లేదా మట్టినైనా పోసేందుకు ప్రయత్నిస్తున్నాం. గుంతల్లో మట్టిపోయిస్తాం. మిగిలిన మట్టిరోడ్లను సీసీ రోడ్లు చేయిస్తాం.
ప్రశ్న : మల్లారం జంక్షన్ వద్ద అన్ని సమస్యలే ఉన్నాయి.
– రవి, కుమార్–నందిచౌరస్తా
కమిషనర్ : మా సిబ్బందిని పంపించి మట్టి డ్రెయినేజీలను వెడల్పు చేయిస్తాం. పెరిగిన మొక్కలను తొలగిస్తాం. కట్టుకాలువ పనులు ముందుకుసాగేలా చొరవ తీసుకుంటాం. శివారుకాలనీలో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాం.
ప్రశ్న : మార్కండేయనగర్‌లో మురికినీరు నిలుస్తోంది. పైపులైన్ లీకేజీ ఉంది.
– పిట్టల మనోహర్– అడ్వకేట్
కమిషనర్ : పారిశుధ్య సిబ్బందిని పంపించి మురికినీరు నిల్వకుండా చూస్తాం. పైపులైన్ లీకేజీపై మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి సరిచేయిస్తాం.
ప్రశ్న : నందీశ్వర నుంచి వచ్చే మురికినీటితో ఇబ్బంది పడుతున్నాం.
– వంగల కర్ణ అడ్వకేట్, 17వ వార్డు
కమిషనర్ : శానిటేషన్ సిబ్బందిని పంపించి ఈ సమస్య పునరావృతం కాకుండా చూస్తాం. ఈ ప్రాంతాన్ని ఆలయ పారిశుధ్య విభాగం పరిశీలిస్తుంది. రెండు డిపార్ట్‌మెంట్లు సంయుక్తంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
ప్రశ్న : వీధిదీపాలు వెలగడం లేదు. చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం.
– సుధీర్‌కుమార్, దేవరకొండ రాజేశ్, శ్రీనివాస్, హమీద్
కమిషనర్ : వీధిదీపాలు ఎప్పటికప్పుడు సెట్ చేస్తున్నాం. వర్షాలు, గాలివానలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలనీల్లో చీకట్లు లేకుండా చూస్తాం.
ప్రశ్న : ఫాగింగ్ చేయడం లేదు. దోమలు పెరుగుతున్నాయి.
– మహేశ్–23వ వార్డు, రాజిరెడ్డి,
వాసం భూమేశ్, మార్కండేయనగర్
కమిషనర్ : ప్రతీ శుక్రవారం డ్రై డే చేపడుతున్నాం. మా సిబ్బంది కాలనీల్లోని ప్రతీ ఇంటిని టచ్ చేస్తున్నారు. నీరు నిల్వ ఉండకుంటా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ రోజు రెండు వార్డులకు ఫాగింగ్ చేయిస్తున్నాం. దోమలు పెరగకుండా ఆయిల్‌బాల్స్ కూడా వేయిస్తున్నాం.
ప్రశ్న : చేపల మార్కెట్‌తో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడి నుంచి తరలించిండి.
– శేఖర్, రమేశ్, రాజు, శ్రీనివాస్
కమిషనర్ : బైపాస్‌రోడ్డులోని చేపల మార్కెట్‌ను త్వరలోనే మరో ప్రాంతానికి తరలించనున్నాం. ఇప్పటికే ఈ సమస్య మా దృష్టికొచ్చింది. తప్పకుండా మరో ప్రాంతానికి తరలించి ప్రజలకు సౌకర్య వంతంగా చేస్తాం.
ప్రశ్న : మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ సవరించండి. చేతిపంపు రిపేర్ చేయించండి.
– అనిల్‌కుమార్, 2వ వార్డు
కమిషనర్ : లీకేజీని సెట్ చేయిస్తాం. ఇప్పటికే రెండుసార్లు రిపేర్ చేయించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. చేతిపంపు రిపేర్ చేయిస్తాం.

సమస్యలు పరిష్కరిస్తాం