మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Jul 6 2025 6:30 AM | Updated on Jul 6 2025 6:30 AM

మహిళల

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రుణాలు తీసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల పరిషత్‌లో శనివారం కల్యాణలక్ష్మీ, సీఎమ్మార్‌ఎఫ్‌, లోన్‌బీమా చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఆదర్శ మహిళా సమాఖ్య సంఘానికి పెట్రోల్‌బంక్‌ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి చనిపోయిన 20 మందికి లోన్‌ బీమా కింద రూ.14.80లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పొత్తూరులో ఏప్రిల్‌లో ఉపాధిహామీ పనులు చేస్తూ మరణించిన దయ్యాల లింగయ్యకు ప్రభుత్వం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి, డిప్యూటీ తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో శశికళ, ఐకేపీ ఏపీఎం కట్ట వాణిశ్రీ, నాయకులు పసుల వెంకటి, పాశం రాజేందర్‌రెడ్డి, చిట్టి ఆనందరెడ్డి, గుండ వెంకటేశం, మామిడి నరేశ్‌, యాస తిరుపతి పాల్గొన్నారు

సోషలిజం అంటే బీజేపీకి భయం

సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

సిరిసిల్లటౌన్‌: బీజేపీకి సోషలిజం, సెక్యులరిజం అంటేనే భయమని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సిరిసిల్లలోని పార్టీ భవనంలో పట్టణ కార్యదర్శి పంతం రవి అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పోరాడే పార్టీ సీపీఐ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఎరువులు విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో చేస్తున్న మారణహోమాన్ని ఆపి, మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌, నాయకులు గుంటి వేణు, కడారి రాములు, మీసం లక్ష్మణ్‌, మంద అనిల్‌, తిరుపతి రెడ్డి, సోమ నాగరాజు, అనసూయ, ఎలిగేటి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘లక్ష’ణంగా మహిళాశక్తి చీరల బట్ట సేకరణ

రోజుకు లక్ష మీటర్లు

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణ ‘లక్ష’ణంగా సాగుతోంది. వస్త్రోత్పత్తిదారుల ఇళ్ల వద్దనే చీరల బట్ట నాణ్యతను పరిశీలిస్తూ.. తనిఖీ చేస్తున్నారు. అన్నీ బాగుంటేనే చీరల బట్ట టాకాలను గోదాముకు పంపుతున్నారు. జూన్‌ 23న ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఇందిరానగర్‌లోని ఏఎంసీ గోదాములో చీరల బట్ట సేకరణను ప్రారంభించారు. సెలవు రోజులు మినహా నిత్యం లక్ష మీటర్ల చొప్పున చీరల బట్టను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు పది లక్షల మేరకు బట్ట సేకరించగా.. వస్త్రోత్పత్తిదారుల వద్ద మరో 50 లక్షల మీటర్లు సిద్ధంగా ఉంది. నాణ్యత పరిశీలన, తనిఖీలు తప్పనిసరి కావడంతో ఇందిరామహిళా శక్తి చీరల బట్టను అందించడం ఆలస్యమవుతుందని వస్త్రోత్పత్తిదారులు చెబుతున్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి  సాధించాలి
1
1/2

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి  సాధించాలి
2
2/2

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement