
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
డ్రెయినేజీ శుభ్రం
భగవంతరావునగర్‌లోని తాటికొండ ఫంక్షన్‌హాల్ వద్ద డ్రెయినేజీ శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బంది
వేములవాడ: ‘సాక్షి’ ఈనెల 4న నిర్వహించిన మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌ఇన్‌లో వ చ్చిన ఫిర్యాదులపై కమిషనర్ అన్వేశ్ శనివారం చర్యలకు ఆదేశించారు. భగవంతరావునగర్‌లోని తాటికొండ ఫంక్షన్‌హాల్ వద్ద డ్రెయినేజీని శుభ్రం చేయించారు. 20వ వార్డు నుంచి ఫోన్‌ఇన్‌లో కమిషనర్ దృష్టికి తెచ్చిన సమస్యపై ఆరా తీసేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుకుమార్‌ను పంపించి పరిష్కరించినట్లు తెలిపారు. దీంతో సాక్షి ఫోన్ ఇన్‌లో తమ సమస్యలను వివరించిన వెంటనే స్పందించిన కమిషనర్‌కు, సహకరించిన సాక్షికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

వాతావరణం