
మురికి కూపం..వ్యాధుల స్థావరం
సిరిసిల్ల: అసలే వర్షాకాలం.. ఆపై కంపుకొడుతున్న మురికికూపం.. జిల్లా కేంద్రం నడిబొడ్డున దోమలకు నిలయంగా మారింది. వ్యాధులు విజృంభించే సీజన్‌లో ఇలా జనావాసాల మధ్య మురికికూపంతో విద్యానగర్ పోచమ్మ ఆలయం సమీపంలో వారు ఇబ్బందులు పడుతున్నారు. విద్యానగర్ పోచమ్మ ఆలయం సమీపంలో అక్షర అపార్టుమెంట్ వీధిలో మురికికూపం ఏర్పడింది. ఆ వీధిలోని మురికినీరంతా అందులోకి చేరుతుంది. అపార్టుమెంట్ పక్కనే మురికినిల్వ ఉండడంతో పందులు, బర్రెలు బొర్లుతున్నాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పర్యటించి మురికినీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

మురికి కూపం..వ్యాధుల స్థావరం

మురికి కూపం..వ్యాధుల స్థావరం