
ఫ్లెక్సీ కట్టు..ఇసుక కొట్టు !
● ఇష్టారాజ్యంగా తరలింపు
● అడ్డుకున్న గ్రామస్తులు
వేములవాడరూరల్: నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకకు అనుమతులు ఇవ్వగా.. ఇదే అదనుగా భావించిన కొంద రు ట్రాక్టర్ యజమానులు అక్రమార్గం పట్టిస్తున్నా రు. ఇందిరమ్మ ఇంటికి అనే ఫ్లెక్సీ పెట్టుకుని ఇతరులకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతులు ఇస్తే ట్రాక్టర్ యజమానులు ఫ్లెక్సీలు కట్టుకుని ఉదయం నుంచే అడ్డూ అదుపు లేకుండా తరలిస్తున్నారు. ఈ విషయంపై వేములవాడరూరల్ మండలం లింగంపల్లి మూలవాగు నుంచి గురువారం ఇసుకను తరలి స్తున్న ట్రాక్టర్లను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్‌శాఖ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అధికారులు అనుమతులు ఇవ్వకున్నా కొందరు ట్రాక్టర్ యజమానులు ఇసుకను నింపుకుని తరలిపోతున్న సంఘటనను చూశారు. దీంతో గ్రామస్తులకు, ట్రాక్టర్ యజమానులకు గొడవ జరిగింది. ఈ విషయంపై తహసీల్దార్ అబూబాకర్, ఎస్‌ఐ అంజయ్య ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అధికారుల సాక్షిగా..
అనుమతులు లేకుండా కొంత మంది ఇసుకను తరలిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకోగా అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చాలా మందికి అనుమతులు లేనప్పటికీ వదిలిపెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. రోజుకు ట్రాక్టర్‌కు రెండు ట్రిప్పులే అనుమతులు ఉన్నప్పటికీ 5 నుంచి 8 ట్రాక్టర్లు ఇసుకను తరలి స్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయం అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా నిబంధనల మేరకే ఇసుకను తరలించాలని ఎవరైనా అనుమతులు లేకుండా తరలిస్తే కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ఇసుక టోకెన్‌లు ఉంటేనే వాగులోకి దింపాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఫ్లెక్సీ కట్టు..ఇసుక కొట్టు !