రైతులను రాజులను చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతులను రాజులను చేయడమే లక్ష్యం

Jul 3 2025 4:54 AM | Updated on Jul 3 2025 4:54 AM

రైతుల

రైతులను రాజులను చేయడమే లక్ష్యం

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

వేములవాడ: రైతులను రాజులుగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రైతుభరోసా సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పీఏసీఎస్‌ చైర్మన్లు వెంకట్రామారావు, సురేందర్‌రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, సెస్‌ డైరెక్టర్‌ సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్‌రెడ్డి, దుర్గారెడ్డి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

మద్యపానానికి దూరంగా ఉండాలి

సిరిసిల్లటౌన్‌: నేతకార్మికులు మద్యపానం తదితర వ్యసనాల నుంచి విముక్తి పొందాలని సిరిసిల్ల మైండ్‌కేర్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ సైకాలజిస్టు కె.పున్నంచందర్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌ తదితర కార్మికవాడల్లో బుధవారం మనోవికాస సదస్సు నిర్వహించి మాట్లాడారు. మద్యపాన వ్యసనం సైకో సోమాటిక్‌ డిజార్డర్‌ వ్యాధిగా మారుతుందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు మైండ్‌కేర్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో సైకాలజిస్ట్‌ మరియు సైకియాట్రస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైండ్‌కేర్‌ సెంటర్‌ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ పాల్గొన్నారు.

చిరు జల్లులు

సిరిసిల్ల: జిల్లాలో బుధవారం చిరుజల్లులు కురిశాయి. మూడు రోజులుగా జిల్లాలో ముసురువర్షం కురుస్తూనే ఉంది. ముస్తాబాద్‌లో అత్యధికంగా 29.3 మిల్లీమీటర్లు, అత్యల్ప ంగా రుద్రంగిలో 7.6 మిల్లీమీటర్లు కురిసింది. చందుర్తిలో 11.5, వేములవాడ రూరల్‌లో 9.6, బోయినపల్లిలో 8.4, వేములవాడలో 12.5, సిరిసిల్లలో 18.0, కోనరావుపేటలో 14.7, వీర్నపల్లిలో 20.2, ఎల్లారెడ్డిపేటలో 24.7, గంభీరావుపేటలో 28.3, తంగళ్లపల్లిలో 21.0, ఇల్లంతకుంటలో 20.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లా అంతటా సగటు వర్షపా తం 17.4 మిల్లీమీటర్లుగా రికార్డు అయింది.

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

సిరిసిల్లటౌన్‌: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని బీడీవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి సూరం పద్మ కోరారు. సిరిసిల్లలోని బీడీ కంపెనీల్లో బుధవారం యజమానులకు సమ్మె నోటీసులు ఇచ్చి కార్మికలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సూచించారు.సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని బీడీ కార్మికులు పాల్గొనాలని కోరారు. యూనియన్‌ ప్రతినిధులు శ్రీరాముల రమేశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

రైతులను రాజులను   చేయడమే లక్ష్యం
1
1/3

రైతులను రాజులను చేయడమే లక్ష్యం

రైతులను రాజులను   చేయడమే లక్ష్యం
2
2/3

రైతులను రాజులను చేయడమే లక్ష్యం

రైతులను రాజులను   చేయడమే లక్ష్యం
3
3/3

రైతులను రాజులను చేయడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement