
నీటివనరుల సంరక్షణకు చర్యలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో నీటివనరుల సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మండలంలోని దేశాయిపల్లిలో బుధవారం కలెక్టర్ పర్యటించి స్థానిక నక్కవాగు నుంచి దేశాయిపల్లి కొత్తచెరువులోకి వచ్చే ఫీడర్ చానల్‌లో డీసిల్టింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా ఇరిగేషన్ అధికారి కిశోర్, డివిజన్–7 ఈఈ ప్రశాంత్, డీఈఈ సత్యనారాయణ, సాగర్ ఉన్నారు.
విద్యార్థులకు సరైన బోధన అందించాలి
విద్యార్థులకు సరైన బోధన అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మండలంలోని పద్మనగర్ కేంద్రీయ విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రిన్సిపాల్ శేషప్రసాద్ ఉన్నారు.
– కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా