
వసతుల కల్పనే లక్ష్యం
వేములవాడ/కోనరావుపేట(వేములవాడ): పట్టణాలు, గ్రామాల్లో వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకుపోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. వేములవాడలో పలు అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేసిన విధంగా నేతన్నలకు రుణమాఫీ చేశామన్నారు. వేములవాడ పట్టణం చేనేతకు ఒక క్లస్టర్‌గా ఉందన్నారు. 90 శాతం సబ్సిడీపై యారన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు వివరించారు. మూలవాగు, గుడి చెరువుల్లో మురికినీరు కలవకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
నిరుపేదలకు పక్కా ఇండ్లు
నిరుపేదలకు పక్కా ఇండ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండల పరిషత్‌లో బుధవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారన్నారు. ప్రతీ నెల రూ.6వేల కోట్లు అప్పులకే చెల్లిస్తున్నట్లు తెలిపారు. కోనరావుపేట మండలంలో అన్ని గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే స్వగ్రామానికి నీరు, రోడ్డు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, ఏఎంసీ డైరెక్టర్ సాసాల మల్లారెడ్డి, చేపూరి గంగాధర్, బైరగోని నందు, గోపాల్, గొట్టె రుక్మిణి, దేవరాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్