
నెలంతా పరేషన్
● మూడు నెలల కోటాతో ముప్పుతిప్పలు ● మొదట్లో సాంకేతిక సమస్యలు ● రేషన్‌షాపులకు చేరిన 96 శాతం బియ్యం ● కొనసాగుతున్న పంపిణీ
● ఇతను పోతు శ్రీనివాస్. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన శ్రీనివాస్ బీడీకంపెనీలో పనిచేస్తాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. నెలకు 24 కిలోల బియ్యం వస్తాయి. మూడు నెలల బియ్యం 72 కిలోలు వచ్చాయి. మొన్నటి వరకు రేషన్‌షాపు వద్ద రద్దీగా ఉండడంతో బియ్యం తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడ్డాడు. రెండు, మూడుసార్లు షాపు వద్దకు వచ్చి మర్లిపోయాడు. బుధవారం రేషన్‌షాపు వద్ద పెద్దగా రద్దీ లేకపోవడంతో రేషన్‌బియ్యం తీసుకెళ్తున్నాడు.
● ఇతను బోయినపల్లికి చెందిన నేతకార్మికుడు మహేశుని శ్రీధర్. మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి ఇస్తున్నారని రేషన్‌షాపు వద్దకు వెళ్లగా కోటా అయిపోయింది. మరో 50 క్వింటాళ్ల బియ్యం రావాలే. అవి వచ్చిన తర్వాత ఇస్తానని డీలర్ చెప్పడంతో షాపు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కోటా రాలేదని డీలర్ చెబుతున్నాడు. సకాలంలో బియ్యం కోటా రాకపోవడంతో శ్రీధర్ నిరాశకు గురవుతున్నాడు.
ప్రజాపంపిణీ స్వరూపం ఇలా..
గ్రామాలు : 260
రేషన్ షాపులు : 345
రేషన్‌కార్డులు : 1,77,851
అంత్యోదయకార్డులు : 13,748
అంత్యోదయ అన్నయోజన కార్డులు : 203
రేషన్‌బియ్యం పొందే వారు : 5,35,920
ప్రతి నెలా బియ్యం సరఫరా : 3,565 మెట్రిక్ టన్నులు
మూడు నెలల కోటా : 10,696 మెట్రిక్ టన్నులు
రేషన్ షాపులకు చేరిన బియ్యం : 10,323 మెట్రిక్ టన్నులు

నెలంతా పరేషన్

నెలంతా పరేషన్

నెలంతా పరేషన్

నెలంతా పరేషన్