
ఆలయంలో ఆకస్మిక తనిఖీలు
వేములవాడ: రాజన్న ఆలయంలోని పలు వి భాగాలు, ప్రసాదాల తయారీ గోదాంలను ఈవో రాధాభాయి బుధవారం తనిఖీ చేశారు. గోదాముల్లో సరుకుల నాణ్యత, పరిణామం, ఎక్స్‌పైరీ తేదీని పరిశీలించారు. ఈవో ఆకస్మిక తనిఖీలలో ఆలయంలోని కౌంటర్లు, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తమయ్యారు.
సర్కారు నిర్లక్ష్యంతో విద్యార్థుల అవస్థలు
● బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సిరిసిల్లలో బీఆర్‌ఎస్వీ బడిబాట చేపట్టారు. సదుపాయాలు, విద్యాప్రమాణాల గురించి శివనగర్ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. మెట్టెల సాయిదీపక్, వల్లబోజు వెంకటరమణ, రాచమల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
సిరిసిల్లకల్చరల్: పాలీసెట్ ఉత్తీర్ణులకు శుక్రవారం నుంచి ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు అగ్రహారంలోని శ్రీరాజరాజేశ్వర ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరా చారి ప్రకటనలో తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను జూలై 1 వరకు పరిశీలించిన అనంతరం కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూలై 4న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు https//tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆస్పత్రిని బుధవా రం పరిశీలించారు. రాధిక జైస్వాల్ మాట్లాడు తూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. లోక్ అదాలత్ స భ్యులు చింతోజ్ భాస్కర్, ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సత్యనారాయణస్వామి ఉన్నారు.
డిగ్రీ తరగతులు నిర్వహించాలి
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎల్లారెడ్డిపేటలో నెలకొల్పి మూడేళ్లు గడుస్తున్నా ఎక్కడ ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితులున్నాయని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజురావు పేర్కొన్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. కళా శాలకు కనీసం బోర్డు ఏర్పాటు చేయలేదని, ప్రచారానికి కరపత్రాలు పంపిణీ చేయడం లేదన్నారు. విద్యార్థి నాయకులు ధనూష్, శ్రీనివాస్ ఉన్నారు.
ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రానికి పవర్‌లూమ్ కార్మికులు, ఆసాములకు ఒప్పందం ప్రకారం యజమానులు కూలీ చెల్లించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు మూశం రమేశ్ కోరారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. పాలిస్టర్ వస్త్రానికి పవర్‌లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆడెపు భాస్కర్, అంకారపు రవిలకు వినతిపత్రాలు అందజేశారు.

ఆలయంలో ఆకస్మిక తనిఖీలు

ఆలయంలో ఆకస్మిక తనిఖీలు