
ఎమర్జెన్సీపై బీజేపీ నిరసన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు కావడంతో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సిరిసిల్లలో చేపట్టిన నిరసన ర్యాలీలో నల్లబ్యాడ్జీలు ధరించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలుకు వెళ్లిన జిల్లాకు చెందిన ప్రభాకర్‌రావు, గాల్‌రెడ్డిలను సన్మానించారు. భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, సిరిసిల్ల
అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, జిల్లా అధికార ప్రతినిధి నవీన్‌యాదవ్, నాగుల శ్రీనివాస్, పండుగ మాధవి పాల్గొన్నారు.

ఎమర్జెన్సీపై బీజేపీ నిరసన