
యూ టర్న్.. ప్రాణాలు పోతున్నాయి
● ముందుగానే హెచ్చరించిన ‘సాక్షి’ ● స్పందించని అధికారులు
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయం ఎదుట కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై యూ ప్రమాదకరంగా ఉంది. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఈనెల 14న ‘సాక్షి’ లో ‘డేంజర్ యూ టర్న్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే బుధవారం ప్రమాదం జరి గేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. యూ టర్న్ వద్ద హనుమా న్ ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, కరీంనగర్ పాలడెయిరీ, పాలిటెక్నిక్, డిగ్రీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. విద్యార్థులు, భక్తులతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రధాన రహదారిపై యూ టర్న్ ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ యూటర్న్‌ను మూసివేసి కొంచెం దూరంలో ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో స్టాపర్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.