
నిలిచిన చేపల విక్రయాలు
సిరిసిల్లటౌన్: ఏళ్లుగా చేపల విక్రయాలు కొనసాగిస్తున్న పాతమార్కెట్ పక్షం రోజులుగా బోసిపోయింది. రైతుబజార్‌లో విక్రయించుకోవాలని అధి కారులు సూచించగా.. అక్కడ వ్యాపారం సరి గ్గా జరుగడం లేదని గంగపుత్రులు పేర్కొంటున్నా రు. అధికారుల సూచనలతో ఈనెల 15న రైతుబజార్‌లో చేపలు విక్రయించేందుకు దుకాణాలు పెట్టుకుంటే వ్యాపారం పెద్దగా జరుగలేదని వాపోతున్నారు. అధికారులు పాతమార్కెట్‌లో వద్దనడంతో గంగపుత్రులు పూర్తిగా చేపల అమ్మకాలనే బంద్ చేశారు.
బోసిపోయిన ఫిష్ మార్కెట్
సిరిసిల్లలోని పాతకూరగాయల మార్కెట్ ప్రాంగణంలోనే దశాబ్దాలుగా ఫిష్, మటన్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుబజార్ నిర్మించగా.. ఆ సమయంలోనే ఫిష్, మటన్ మార్కెట్లను అక్కడికి తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణ శివారులోని కొత్త రైతుబజారుకు వినియోగదారులు తక్కువగా వస్తుండడంతో చేపలు, మటన్ మార్కెట్లు పాత మార్కెట్లోనే కొనసాగుతున్నాయి.ఆ సమయంలో రైతుబజారులోకి కూరగాయల రైతులను, అడ్తీదారులను మాత్రమే తరలించారు. పాతకూరగాయల మార్కెట్లో వ్యాపారులు మాత్రమే కూరగాయలు, పండ్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు. గంగపుత్రులు మాత్రం పాతమార్కెట్లోనే చేపలు విక్రయిస్తామని విన్నవించగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు అంగీకరించడం లేదు. దీంతో గత పదిహేను రోజులుగా సిరిసిల్లలో చేపల విక్రయాలు నిలిచిపోయాయి.
సంప్రదింపులు చేపడుతున్నాం
చేపల మార్కెట్‌ను రైతబజారులో ఏర్పాటుకు గంగపుత్రులతో సంప్రదింపులు చేపడుతున్నాం. వారి సంఘం ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులు చేపల విక్రయాలు నిలిపివేశారు. రైతుబజారులో మంచి వాతావరణంలో ఫిష్, మటన్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫిష్, మటన్ వ్యాపారులు ఇక్కడకు వస్తే వసతులు కల్పిస్తాం.
– వెల్ముల స్వరూపరెడ్డి,
ఏఎంసీ చైర్మన్
రైతుబజార్‌కు రావాలంటున్న అధికారులు
పాతమార్కెట్లో నిషేధంపై గంగపుత్రుల నిరసన
పక్షం రోజులుగా కొలిక్కిరాని సమస్య