
సిరిసిల్ల ‘సెస్’ ఎండీగా మోహన్‌రెడ్డి
సిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పిన్నింటి మోహన్‌రెడ్డి సోమవారం విధుల్లో చేరారు. గతంలో ‘సెస్’ ఎండీగా పనిచేసిన విజయేందర్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవు పెట్టి అమెరికా వెళ్లారు. ఆయన స్థానంలో ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్‌గా రిటైర్డు అయిన మోహన్‌రెడ్డిని నియమిస్తూ ‘సెస్’ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆయన ‘సెస్’ ఇన్‌చార్జి ఎండీ, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్పీడీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మోహన్‌రెడ్డి నెలకు రూ.2.50లక్షల వేతనంతో ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు గౌరినేని నారాయణరావు, కొట్టెపల్లి సుధాకర్, ఉద్యోగులు ఎండీకి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శావళిపై అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం గ్రామ శివారులో దర్శావళి గుట్టపై ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ కట్టడాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి వాటిని కూల్చివేయాలని కోరారు. పొన్నాల తిరుపతిరెడ్డి, కంచర్ల పర్శరాములు, పారిపల్లి సంజీవరెడ్డి, ఆంజనేయులు, బందారపు లక్ష్మారెడ్డి, సాయి, నంది నరేశ్, దయాకర్‌రెడ్డి, రంజిత్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌తో నిరంతర విద్యుత్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌తో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం అన్నారు. మండలంలోని నారాయణపూర్‌లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయగా సోమవారం ప్రారంభించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా 18 వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. సెస్ ఏఈఈ పృథ్వీధర్‌గౌడ్, లైన్‌మెన్ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు గౌస్, రాంరెడ్డి, బండారి బాల్‌రెడ్డి, నిమ్మ మల్లారెడ్డి, మహేందర్, ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్, హెల్పర్ సతీశ్ పాల్గొన్నారు.

సిరిసిల్ల ‘సెస్’ ఎండీగా మోహన్‌రెడ్డి