
గూడు చెదిరింది..గుండె పగిలింది
● షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం ● రోడ్డునపడిన కుటుంబం
వేములవాడరూరల్: కూలీ పనులు చేసుకుంటూ ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇంటికి నిప్పంటుకుంది. ఫైరింజన్ అధికా రులకు సమాచారం అందించగా వారు వచ్చేలోపే సగం ఇల్లు కాలిపోయింది. ఇంట్లోని ఎలాంటి వస్తు వు మిగులలేదు. ఈ సంఘటన చూసిన చుట్టుపక్క ల వారు స్పందించి తోచిన సాయం అందించారు. ఇది వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె మైసయ్య కుటుంబసభ్యులు మధ్యాహ్నం పనులపై బయటకు వెళ్లారు. అదే సమయంలో ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడంతో చు ట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఇల్లు కాలిపోతుందన్న విషయాన్ని ఫైరింజన్ అధికారులకు తెలిపా రు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేవు. ఇంట్లో ఉన్న వస్తువులు, నగదు, బంగారంతోపాటు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి వస్తువులు లేకవడంతో ఆ కుటుంబాన్ని అయ్యోపాపం అంటూ తోచిన సహాయం అందించారు. కాలిబూడిదైన ఇంటిని చూసి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న రూ రల్ ఆర్‌ఐ బాలు సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ గ్రామస్తులు విన్నవించుకున్నారు.
బాధితులకు విప్ భరోసా
మండలంలోని హన్మాజిపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో గొర్రె మైసయ్య ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని సోమవారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానంటూ మనోధైర్యం కల్పించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. సెస్ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు. వారి కుటుంబానికి నిత్యావసర వస్తువులు, ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరుకు హామీ ఇచ్చారు.