
కొడుకుకు పింఛన్ ఇప్పించండి
మాది గంభీరావుపేట మండలం గజసింగవరం. నాకు ఒక్కగానొక్క కొడుకు పోతు సిద్దిరాములు(65)కు మాట పడిపోయింది. నాలుగేళ్ల క్రితం నా కోడలు లక్ష్మి మృతిచెందింది. పక్షవాతంతో ఐదేళ్లుగా కొడుకు నడవలేని స్థితిలో ఉన్నాడు. నా కొడుకుకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి.
– పోతు నర్సవ్వ, గజసింగవరం(గంభీరావుపేట)
గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయండి
నాకు సమాచారం ఇవ్వకుండా ఇల్లు, ఖాళీ స్థలాన్ని నా రెండో కూతురు పాతూరి పద్మ గిఫ్ట్ డీడ్ చేయించుకుంది. పెన్షన్ కోసమని చెప్పి సంతకాలు చేయించుకొని భూమిని ఆమె పేరుమీద మార్చుకుంది. ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టేషన్‌ను రద్దు చేసి, తిరిగి నా పేరిట పట్టా చేయండి.
– సోమిరెడ్డి లక్ష్మి, బందనకల్(ముస్తాబాద్)

కొడుకుకు పింఛన్ ఇప్పించండి