
బాధితులకు భరోసాగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల ఎడ్యుకేషన్: మహిళలు, చిన్నారులకు అండగా భరోసా కేంద్రాలు ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. బాధితులకు తక్షణ సూచనలు, సలహాలు, సహాయం అందించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. భరోసా సెంటర్ కల్పిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించే వరకూ అండగా నిలవాలన్నారు. లైంగిక, భౌతికదాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయసలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. డీసీఆర్బీ సీఐ నాగేశ్వరరావు ఉన్నారు.