
1,17,858 మందికి రైతు భరోసా
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలోని 1,17,858 మంది రైతులకు రూ.119,46,81,630 రైతు భరోసా డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. రైతులకు ఖరీఫ్ సీజన్(వానా కాలం) వ్యవసాయంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల చొప్పున అందించిందని వివరించారు. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుభరోసా డబ్బులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
బైపాస్‌రోడ్డు విస్తరణపై చర్చ
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ వరకు బైపాస్‌రోడ్డు విస్తరణపై శుక్రవారం చర్చించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులకు సెట్‌బ్యాక్ కావాలని గత నెల 12న నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో పంచాయతీ ఆఫీస్‌లో స్పెషల్ ఆఫీసర్ సమావేశం ఏర్పాటు చేశారు. బైపాస్‌రోడ్డును అభివృద్ధి చేసేందుకు ఉపాధిహామీ ద్వారా రూ.50లక్షలు మంజూరయ్యాయి. కొందరు తెలిపిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్తామని గ్రామపంచాయతీ అధి కారులు తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీని వాస్, కార్యదర్శి వరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈవో ఆకస్మిక తనిఖీ
వేములవాడ: రాజన్న అనుబంధ బద్దిపోచ మ్మ, భీమేశ్వరాలయాల్లో ఈవో రాధాభాయి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కౌంటర్లు, క్యూలైన్లు పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. ఏఈవో అశోక్, పర్యవేక్షకుడు రాజు ఉన్నారు. అనంతపద్మనాభస్వామి ఆలయంలో రేవతీ నక్షత్రోత్సవం సందర్భంగా అభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు.
వేములవాడలో అడ్వకేట్ల నిరసన
వేములవాడ: హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టు బార్ అసోసియేషన్ మాజీ క్యాషియర్ పి.నారాయణపై దాడిని ఖండిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కటకం జనార్దన్, అడ్వకేట్లు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, పొత్తూరి అనిల్‌కుమార్, గుడిసె సదానందం, కిషోర్‌రావు, పురుషోత్తం, పెంట రాజు, వేముల సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వీప్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించే కొత్త వ్యాపారాలతో మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించాలని సెర్ఫ్ డీపీఎం వీరయ్య, జిల్లా ఇన్‌చార్జి డీపీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని కావేరి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల సంఘాల్లోని 25 మంది మహిళలను సీఆర్పీలుగా చేయడానికి మౌఖిక, లిఖిత పరీక్ష నిర్వహించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఏపీఎంలు నర్సయ్య, సుదర్శన్, మల్లేశం, సీసీలు పాల్గొన్నారు.
చిన్నబోనాల శివారులో చిరుత సంచారం
సిరిసిల్లఅర్బన్: చిన్నబోనాల శివారులో చిరుత సంచరించడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురయ్యారు. శివారులోని పంట పొలంలో చిరుత అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రైతులు, గ్రామ స్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

1,17,858 మందికి రైతు భరోసా

1,17,858 మందికి రైతు భరోసా

1,17,858 మందికి రైతు భరోసా