
సాధికారతే లక్ష్యంగా..
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళా సాధికారతే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. జిల్లాలోని ఐకేపీ మహిళా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులకు ఆర్థిక కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ప్రభుత్వ పథకాల అమలుపై శిక్షణ ఇచ్చారు. ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. మొదట గ్రామైక్య అధ్యక్షురాలిని, తర్వాత మండల సమాఖ్య అధ్యక్షులను ఎన్నుకున్నారు. వారి ద్వారా జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకున్నారు. వీరికి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. సీనియర్ రిసోర్స్‌పర్సన్‌లు శిక్షణనిస్తున్నారు.
జిల్లాలో 441 గ్రామైక్య సంఘాలు
జిల్లాలో 441 గ్రామైక్య సంఘాలు, 10,014 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 1,15,317 మంది సభ్యులు ఉన్నారు. నూతనంగా గ్రామైక్య సంఘాలకు ఎన్నికై న పాలకవర్గాలకు సంఘాల నిర్వహణ, ఆర్థిక కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమ హక్కులపై చైతన్యం పొందడమే కాకుండా సామాజిక రంగాల్లో చురుకుగా పాల్గొనేలా శిక్షణ ఇచ్చారు. శిక్షకులు, సామూహిక చర్చలు, ప్రాక్టికల్ సెషన్లు, విజువల్ ప్రజెంటేషన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాల మధ్య సరైన సంబంధం ఏర్పడేందుకు ఈ శిక్షణ బలమైన పునాది కానుంది.
మహిళా సంఘాలకు కొత్త సారథులు
ముగిసిన శిక్షణ తరగతులు
జిల్లాలో 441 గ్రామైక్య సంఘాలు