సిరిసిల్లటౌన్: దివ్యాంగులు జిల్లా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్‌సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైశ్వా ల్ కోరారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం క్యాంపును సందర్శించి మాట్లాడారు. వినికిడిలోపం, మేధో వైకల్యం, లో కో మోటార్, తక్కువ దృష్టి, మానసిక అనారో గ్యం, మెంటల్ రిటార్డేషన్ వంటి వైకల్యాలున్న పిల్లలకు యూడీఐడీ కార్డులను జారీ చేయడంపై పర్యవేక్షించారు. జనవరి 1 నుంచి జూన్ 15 వరకు 43 మంది పిల్లలు స్క్రీనింగ్ చేయబడ్డార ని, ఇప్పటి వరకు 26 మంది పిల్లలు యూడీఐడీ కార్డులు పొందినట్లు తెలిపారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ హాజరయ్యారు.