రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ | - | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ

Jun 20 2025 6:45 AM | Updated on Jun 20 2025 6:53 AM

● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

సిరిసిల్ల: జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా చెల్లింపులు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 1,10,322 మందికి పెట్టుబడి సాయం జమయిందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం తెలిపారు. ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌ సాగు పెట్టుబడి కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుభరోసా విడుదల చేసిందని కలెక్టర్‌ వివరించారు. గత నాలుగు రోజుల్లో రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.99,52,19,906 జమయినట్లు ప్రకటించారు.

క్షయవ్యాధి కేసులు తగ్గించాలి

డీఎంహెచ్‌వో రజిత

కోనరావుపేట(వేములవాడ): జిల్లాలో క్షయవ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత సూచించారు. కోనరావుపేట పీహెచ్‌సీలో టీబీ చాంపియన్స్‌కు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. డాక్టర్‌ రజిత మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి కేసులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. టీబీ వ్యాధికి గురై మందులు వాడి కోలుకున్న వారిని టీబీ చాంపియన్స్‌గా పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. టీబీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అనిత, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వేణుమాధవ్‌, ఇంపాక్ట్‌ ఇండియా జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్‌, ఎస్‌టీఎస్‌ జైత్య, పీహెచ్‌సీ సూపర్‌వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

అన్నదానానికి రూ.2లక్షల విరాళం

వేములవాడ: రాజన్న అన్నదాన సత్రానికి న్యూఢిల్లీలో నివాసముంటున్న బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన పీచర శ్రీహర్ష, సుప్రీంకోర్టు అడ్వకేట్‌ కృష్ణ తలో రూ.లక్ష చొప్పున రూ.2లక్షలు ఏఈవో శ్రవణ్‌కు గురువారం అందజేశారు. భక్తులకు అన్నదానం కోసం వినియోగించాలని కోరారు.

సాగునీటి ఇబ్బందులు తొలగిస్తాం

ఎగువమానేరు డిప్యూటీ డీఈఈ రవికుమార్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎగువమానేరు ఆయకట్టు రైతులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి సమస్య రాకుండా, డీ10 లెవల్‌ కాల్వలను మరమ్మతు చేస్తున్నట్లు ఎగువమానేరు కాలువల డిప్యూటీ డీఈఈ రవికుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని బండలింగంపల్లి శివారులో డీ10 లెవల్‌ కాలువల మరమ్మతులో భాగంగా గురువారం అధికారులు కొలతలు తీసి పరిశీలించారు. రవికుమార్‌ మాట్లాడుతూ రూ.5లక్షల వ్యయంతో ఈ సీజన్‌లో కాలువల వెంట పిచ్చిమొక్కలు, గడ్డి పెరుగకుండా సీసీ వేయడం, తూములు, షట్టర్ల మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు. చివరి ఆయకట్టు భూములు తడిసేలా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఏఈఈ, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజు, మాజీ సర్పంచ్‌ బాల్‌రాజ్‌ నర్సాగౌడ్‌ ఉన్నారు.

ఘనంగా చౌడాలమ్మ కల్యాణం

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం బొల్లారంలో చౌడాలమ్మ కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వకుళాభరణం శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంగ స్వామి ఉన్నారు.

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ
1
1/4

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ
2
2/4

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ
3
3/4

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ
4
4/4

రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement