సిరిసిల్ల: నిత్య సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుష్ యునానీ
డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి.శ్రీనివాస్, టి.స్వప్న తెలిపారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో గురువారం కామన్ యోగా ప్రొటోకాల్‌పై జిల్లా అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా కలిగే లాభాల గురించి వివరించారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఉపాధి కల్పనాధికారి ఉపేందర్‌రావు, డీఏవో అఫ్జల్‌బేగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన ఆఫీసర్ రామ్‌రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప, డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి, డీటీవో లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.