
రోడ్‌డ్యామ్‌లో వ్యర్థాలు తీసేయాలి
రాళ్లబావి– శాంతినగర్ రోడ్‌డ్యామ్‌లో వ్యర్థాలను తొలగించాలి. డ్రెయినేజీల్లో సిల్టు నిండింది. డ్రెయినేజీలు పెద్దవిగా నిర్మిస్తే వరదనీరు కింది ప్రాంతాలకు సులువుగా వెళ్తుంది. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
– తిప్పవరం
రజనీకాంత్, రాళ్లబావి
పదిహేనేళ్లుగా ఇదే తంతు..
చిన్న వర్షం పడితే చాలు సంజీవయ్యనగర్ కమాన్ ప్రాంతం వరదల్లో చిక్కుకుంటుంది. మా ఏరియాలో దవాఖానాలు ఎక్కువగా ఉన్నాయి. వాన పడితే రోగులు వైద్యం చేయించుకోలేక, స్థానికులం ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. అధికారులు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలి. కొత్తగా మోరీలు నిర్మించాలి.
– వడ్నాల శేఖర్‌బాబు, సంజీవయ్యనగర్
వరదల ముప్పు తప్పించాలి
ఏటా మా శ్రీనగర్ కాలనీకి వరద ముప్పు ఉంటుంది. కొత్తచెరువు నుంచి వచ్చే వరద, మత్తడికాల్వలు కబ్జాకు గురయ్యాయి. వరదల నివారణకు కచ్చా నాలా తవ్వారు. శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కాలనీల్లో సీసీరోడ్లు, మోరీలు పూర్తిస్థాయిలో నిర్మించాలి.
– కందాల నవీన్‌కుమార్, శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు

రోడ్‌డ్యామ్‌లో వ్యర్థాలు తీసేయాలి

రోడ్‌డ్యామ్‌లో వ్యర్థాలు తీసేయాలి