
కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ విక్రయిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ టీం అధికారులు హెచ్చరించారు. ముస్తాబాద్‌లో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ టీం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల వ్యవసాయాధికారులు దుర్గరా జు, సంజీవ్, ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ కలి గి ఉండాలన్నారు. స్టాక్ రిజిష్టర్లు, ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. రైతులు తప్పకుండా రశీదులు పొందాలని సూచించారు. నకిలీ విత్తనా లు, పెస్టిసైడ్స్ విక్రయిస్తే పోలీసులకు సమాచా రం అందించాలన్నారు. ఎరువులు, విత్తనాలు ఎవరైన అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.