కోడెల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వేములవాడఅర్బన్: తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలోని కోడెల కోసం రైతులు, ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. వెబ్‌సైట్ https://rajannasiricilla.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డ్‌లతో వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
భూభారతితో సమస్యలు పరిష్కారం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ముస్తాబాద్(సిరిసిల్ల): భూ భారతితో రైతుల భూమి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని ఆవునూర్‌లో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ప్రభుత్వ విప్ గురువారం పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో గ్రామాల్లో అనేక భూమి సమస్యలు సృష్టించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి రద్దు చేసి.. భూభారతిని తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, నాయబ్ తహసీల్దార్ అపర్ణ, ఆర్‌ఐ సుమలత, సారగొండ రాంరెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీను, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు
గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని గోరింటాలలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. తహీసీల్దార్ మారుతిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఘనంగా రావి నారాయణరెడ్డి జయంతి
సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జయంతి వేడుకలను సిరిసిల్లలోని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘంలో గురువారం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించిన యోధుడని కొనియాడారు. జిల్లా కోర్ కమిటీ సభ్యులు బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నర్సింహారెడ్డి, కోశాధికారి ఎడమల హన్మంతరెడ్డి, కార్యవర్గ సభ్యులు కంది భాస్కర్‌రెడ్డి, అబ్బాడి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించుకోవాలి
సిరిసిల్లటౌన్: జిల్లా ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ప్రభుత్వాన్ని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోసం ఉద్యమించిన కేసు విషయమై గురువారం ఉద్యమకారులతో కలిసి కరీంనగర్ కోర్టుకు హాజరయ్యారు. జిల్లా ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు తిప్పలు తప్పడం లేదన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ న్యాయం చేయాలని కోరారు. మైలారం తిరుపతి, కంసాల మల్లేశం, వీరవేని మల్లేశంయాదవ్ తదితరులున్నారు.
కోడెల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
కోడెల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
కోడెల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


